Saturday, July 27, 2013

July 2013 Current Affairs in Telugu

జులై - 2013 అంతర్జాతీయం


జులై 1
¤ అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో దావానలం చెలరేగింది. మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైన 19 మంది నిపుణులైన సిబ్బంది ఈ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. 
               » గత 80 ఏళ్లలో అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కార్చిచ్చు చెలరేగడం ఇదే ప్రథమమని నిపుణులు వెల్లడించారు.¤ అమెరికా నిఘా సంస్థలు డేగ కన్ను వేసిన 38 దేశాల రాయబార కార్యాలయాల్లో భారత రాయబార కార్యాలయం కూడా ఉన్నట్లు ప్రజా వేగు ఎడ్వర్డ్ స్నోడెన్ బయటపెట్టిన అమెరికా జాతీయ భద్రత సంస్థ పత్రాల్లో వెల్లడయింది.               » స్నోడెన్ బయటపెట్టిన పత్రాల ఆధారంగా లండన్‌కు చెందిన గార్డియన్ పత్రిక రాసిన కథనం ప్రకారం బగ్గింగ్ సహా అనేక రకాలుగా అమెరికా సంస్థలు విదేశీ రాయబార కార్యాలయాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గేర్‌లో బగ్‌లు అమర్చడం ద్వారా కేబుల్స్‌లోకి ప్రవేశించి సమాచారాన్ని యాంటెనా ద్వారా సేకరిస్తారు.               » ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, టర్కీ దేశాల రాయబార కార్యాలయాల మీద కూడా అమెరికా నిఘా ఉంది.               » స్నోడెన్ బయట పెట్టిన పత్రాల ప్రకారం బ్రిటన్, జర్మనీ, ఇతర పశ్చిమ యూరప్ దేశాల మీద అమెరికా నిఘా నీడ వేయలేదు.
జులై 2
 ¤ ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని చైనాలో ప్రారంభించారు.               » 500 మీటర్ల పొడవు, 400 మీటర్ల వెడల్పు, వంద మీటర్ల ఎత్తుతో 'ది న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్' పేరిట ఈ భారీ భవంతిని సియాచిన్ ప్రావిన్స్‌లోని చెంగ్డులో నిర్మించారు.
               » 'ది న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్' అమెరికా రక్షణ స్థావరం 'పెంటగాన్' భవంతి కంటే మూడు రెట్లు పెద్దది. ఆస్ట్రేలియాలోని 'సిడ్నీ ఓపెరా హౌస్' కంటే 20 రెట్లు పెద్దది.               » ఈ చైనా సౌధంలో వ్యాపార కార్యాలయాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు, నీటి ఉద్యానవనాలు లాంటివి ఎన్నో ఉన్నాయి.
¤ మూడు నేవిగేషన్ ఉపగ్రహాలతో ప్రోటాన్-ఎం రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది.               » కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 
               » రాకెట్ పేలిపోవడం వల్ల అత్యంత విషతుల్యమైన హెప్టైల్ ఇంధనం వాతావరణం లోకి విడుదలైంది.               » తాజా ప్రయోగం ద్వారా మూడు గ్లోనాస్-ఎం ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అమెరికాకు చెందిన జీపీఎస్ వ్యవస్థకు పోటీగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై 2020 నాటికి 910 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాలని రష్యా యోచిస్తోంది.¤ ఇండోనేషియాలోని ఏఖ్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో 11 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1 గా నమోదైంది.
జులై 3
¤ ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ ముర్సీని సైన్యం గద్దె దింపింది. రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసింది.
 
మహ్మద్ ముర్సీ
               » ముర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, ఈ ఏడాది కాలంలో అనేక ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారని ఆరోపిస్తూ గత కొంతకాలంగా దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని సైన్యం ఆయనకు గడువు విధించింది. దాన్ని ఆయన లెక్కచేయకపోవడంతో ఆయనను పదవి నుంచి తప్పిస్తున్నట్లుగా ఆర్మీ కమాండర్ జనరల్ అబ్డెల్ ఫత్తా అల్‌సిసి ప్రకటించారు.
               » ముర్సీ స్థానంలో దేశ అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అద్లీ మష్‌మూద్ మన్‌సౌర్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
 
అద్లీ మష్‌మూద్ మన్‌సౌర్
               » నిరుడు జూన్‌లో అధ్యక్ష పదవి పొందిన ముర్సీ ప్రజాదరణ రేటు అక్టోబరులో 79 శాతం నుంచి 2013 ఫిబ్రవరిలో 49 శాతానికి కుంగిపోయింది.               » గత ఆగస్టులో హోస్ని ముబారక్ జమానా నాటి సైనికాధికారులందరినీ ఇంటిముఖం పట్టించిన అధ్యక్షుడు ముర్సీ నవంబరులో తనకు తాను అపరిమిత అధికారాలు కట్టబెట్టుకోవడం దేశంలో గగ్గోలు పుట్టించింది. యుద్ధప్రాతిపదికన వివాదాస్పద రాజ్యాంగ అధికరణలను ఈజిప్ట్‌పై రుద్దాలనుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ లక్షమంది ఆందోళనకారులు నిర్వహించిన నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా కాక రగిలించింది. దీంతో అధ్యక్షుడు ముర్సీ తన పదవిని కోల్పోయాడు.

జులై 6
¤ శత్రుదేశాల క్షిపణి దాడులను కాచుకునేందుకు అమెరికా చేపట్టిన క్షిపణి రక్షణ కార్యక్రమం విఫలమైంది. పసిఫిక్ మహాసముద్రంపై అమెరికా ఈ పరీక్షను నిర్వహించింది.               » మార్షల్ దీవుల్లోని క్వాజలైన్ ప్రయోగ కేంద్రం నుంచి ఒక దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. దీన్ని కూల్చేందుకు కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ వైమానిక స్థావరం నుంచి నిరోధక క్షిపణిని ప్రయోగించారు. అయితే బాలిస్టిక్ క్షిపణిని నిరోధక క్షిపణి ఢీ కొట్టలేపోయింది.               » 2008 నుంచి ఒక్కసారి కూడా అమెరికా చేపట్టిన ఇలాంటి పరీక్ష విజయవంతం కాకపోవడం గమనార్హం.¤ ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ముర్సీని సైన్యం గద్దె దించడంతో ఆయన మద్దతుదారులైన ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాయుతంగా మారడంతో చెలరేగిన ఘర్షణల్లో 36 మంది మృతి చెందారు.               » ఈజిప్ట్ ప్రధానిగా ప్రముఖ ఉదారవాద నేత మహ్మద్ ఎల్‌బరాదీ ఎంపికయ్యారు. కొత్తగా ఏర్పడ్డ ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తారు.               » అమెరికా రహస్య నిఘా కార్యక్రమాన్ని బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రాజకీయ ఆశ్రయమిచ్చేందుకు లాటిన్ అమెరికా దేశాలైన వెనెజులా, నికరాగ్వా ముందుకొచ్చాయి.               » వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో               » నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ ఒర్టెగా¤ ఆఫ్రికా దేశం నైజీరియాలో యోబే రాష్ట్రంలోని మాముడోలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలపై తీవ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో 42 మంది చనిపోయారు.               » బొకో హరమ్ తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రకటించారు.               » ఇటీవల డగోన్ కుకా పట్టణంలో సైన్యం దాడిలో 22 మంది బొకో హరమ్ తీవ్రవాదులు చనిపోయారు. దానికి ప్రతీకారంగానే ఈ సంస్థ తాజా దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.


జులై - 2013 వార్తల్లో వ్యక్తులు

జులై  2 
¤ అమెరికా ఇంటర్నెట్ గూఢచర్యం గుట్టును బయటపెట్టి మాతృదేశాన్ని ఇరుకున పెట్టిన ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని ప్రాధేయపడుతూ 20 దేశాలకు రాసిన లేఖలను ఆ దేశాలన్నీ తిరస్కరించాయి. అందులో భారత్ కూడా ఉంది.
    ఎడ్వర్డ్ స్నోడెన్
        » స్నోడెన్ ప్రస్తుతం రష్యా లోని మాస్కో విమానాశ్రయంలో తలదాచుకున్నారు. రాజకీయ ఆశ్రయం కోరుతూ రష్యాకు పెట్టుకున్న దరఖాస్తును స్నోడెన్ విరమించుకోవడంతో ఆయన ఎంత కాలమైనా విమానాశ్రయంలో తలదాచుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుమతి ఇచ్చారు.        » అమెరికా జాతీయ భద్రత సంస్థ (ఎన్ఎస్ఏ) సాంకేతిక గుత్తేదారుగా, కేంద్రీయ నిఘా సంస్థ (సీఐఏ) ఉద్యోగిగా పనిచేసిన స్నోడెన్ అమెరికా నిఘా వ్యవస్థ గుట్టమట్లను తెలియజేసే పత్రాలను తీసుకుని హాంకాంగ్ పారిపోయారు. అక్కడి నుంచి వాటిని ఒక్కొక్కటీ బయటపెట్టసాగారు. దాంతో ఆయన మీద అమెరికా గూఢచర్య చట్టాల కింద అభియోగాలు మోపింది. ఇంటర్నెట్ నుంచి కావాల్సిన డేటాను తవ్వి తీసుకోగల వ్వవస్థను అమెరికా ఏర్పాటు చేసుకున్న విషయాన్ని స్నోడెన్ బయట పెట్టారు. హాంకాంగ్‌పై అమెరికా ఒత్తిడి పెరగడంతో జూన్ 23న ఆయన రష్యా పారిపోయారు. ఇంతలో అమెరికా ఆయన పౌరసత్వాన్ని ధ్రువీకరించే పాస్‌పోర్టును రద్దు చేసింది. దాంతో స్నోడెన్ ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. అప్పట్నుంచి ఆయన మాస్కో విమానాశ్రయంలోనే కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 20 దేశాలకు ఆశ్రయం కోరుతూ లేఖలు రాశారు.
జులై  3
        » బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్, గౌరీ దంపతులకు అద్దెగర్భం ద్వారా కుమారుడు జన్మించినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బొంబాయి మున్సిపల్ కమిషన్ (బీఎంసీ) ధ్రువీకరించింది.
జులై  4
¤ బ్రిటన్‌లోని ప్రవాసాంధ్ర విద్యార్థి, 13 సంవత్సరాల జిష్ణు శ్రీహన్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. 7, 8, 9, తరగతుల విద్యార్థులకు బ్రిటన్‌లో నిర్వహించే పోటీల్లో ఒకే ఏడాదిలో బ్రిటన్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్‌లు రెండింటికీ ఎంపికయ్యాడు.
 
జిష్ణు శ్రీహన్స్
        » మాంచెస్టర్ నుంచి ఇంగ్లాండ్ తరపున ఎంపికైన తొలి విద్యార్థిఇతడే కావడం విశేషం.¤ అమర వీరుల బంధు మిత్రుల సంఘం గౌరవాధ్యక్షుడు, మావోయిస్టు పార్టీ మాజీనేత గంటి ప్రసాదం ను నెల్లూరులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
జులై  5
¤ హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ సంచాలకుడు, సీఈవో డాక్టర్ రఘురాంకు బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్‌బరో అంతర్జాతీయ బంగారు పతకాన్ని ది రాయల్ కాలేజ్ అధ్యక్షుడు లాన్ రిట్జ్ బహూకరించారు.
 
డాక్టర్ రఘురాం


జులై - 2013 నియామకాలు
జులై  1 
¤ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య సర్వీసులు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన వి. శివరామకృష్ణ నియమితులయ్యారు.        » సభ్యులుగా మహబూబ్‌నగర్‌కు చెందిన సిహెచ్.వంశీకృష్ణ, కృష్ణాజిల్లాకు చెందిన ఆపసాని సందీప్‌లు నియమితులయ్యారు.¤ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ ఉపకులపతి నజీబ్‌జంగ్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమితుడయ్యారు.        » 1973 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 22 ఏళ్లపాటు వివిధ హోదాల్లో ప్రభుత్వ సేవలు అందించారు. ఏడేళ్లపాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి సీనియర్ సలహాదారుగా వ్యవహరించారు.        » తేజేంద్ర ఖన్నా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు.        » ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ కె.కె.పాల్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన 1970 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. యూపీఎస్‌సీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆయన భార్య అమితాపాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కార్యదర్శిగా ఉన్నారు. ఆర్.ఎస్.ముషాహరి స్థానంలో ఆయన నియమితుడయ్యారు.        » మాజీ సైనికాధికారి ఎ.కె.సింగ్ అండమాన్ నికోబార్ లెఫ్ట్‌నెంట్ గవర్నరుగా భూపేందర్ సింగ్ స్థానంలో నియమితుడయ్యారు.        » పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు వీరేంద్ర కటారియా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితుడయ్యారు. ఇక్బాల్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
జులై  2
¤ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా 1976 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుజాత సింగ్ నియమితులయ్యారు.        » ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న రంజన్ ముథాయ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు.        » ప్రస్తుతం సుజాత జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు.¤ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఛైర్మన్‌గా వి.శివరామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు.¤ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ బాధ్యతలు స్వీకరించారు.        » 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రిజ్వీ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కృష్ణా, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు.
జులై  3
¤ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ఛైర్మన్‌గా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్ బాధ్యతలు స్వీకరించారు.¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ, (ఏపీఎస్ఐడీసీ) ఛైర్మన్‌గా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ నియమితులయ్యారు.        » ఈ సంస్థ డెరెక్టర్లుగా ఎస్.శివారెడ్డి (నల్గొండ జిల్లా) ఎర్రబోతు నాగయ్య (ప్రకాశం జిల్లా), కృష్ణ మోహన్ (విజయనగరం జిల్లా), కె.జి.గంగాధర్ (కర్నూలు జిల్లా) నియమితులయ్యారు.¤ యూటీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా లియోపురి నియమితులయ్యారు.        » ఐఏఎస్ అధికారి కాని వ్యక్తి ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి.        » 2011 ఫిబ్రవరి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అంతకు ముందు ఎండీగా ఉన్న యూకే సిన్హా సెబీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టడంతో ఈ స్థానం ఖాళీ అయింది.¤ సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా శ్రీనివాస్ పాటిల్ నియమితులయ్యారు. బీపీసింగ్ స్థానంలో ఈ నియామకం జరిగింది.
జులై  5
¤ ఏపీ ట్రాన్స్‌కో సీఏండీగా సురేష్ చందా బాధ్యతలు స్వీకరించారు.
   సురేష్ చందా
¤ ఐడీబీఐ బ్యాంక్ ఛైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎం.ఎస్.రాఘవన్ నియమితుడయ్యారు        » ఆర్.ఎం.మల్లా స్థానంలో  నియామకం జరిగింది.
        »
 భారత బ్యాంకుల సమాఖ్యకు నమూనా ఇ-గవర్నెన్స్ పథక రూపకల్పన చేస్తున్న బృందంలో ప్రస్తుతం రాఘవన్ సభ్యుడిగా ఉన్నారు.
¤ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)రిజిస్ట్రార్, కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి వి.వేణుగోపాలకృష్ణ నియమితుడయ్యారు.
¤ నాస్‌కామ్ అధ్యక్షుడిగా మాజీ టెలికాం కార్యదర్శి ఆర్.చంద్ర శేఖర్ నియమితుడయ్యారు.        » గత ఆరేళ్లుగా ఈ పదవిలో ఉన్న సోమ్ మిట్టల్ పదవీ కాలం జనవరి 2014తో ముగియనున్న నేపథ్యంలో చంద్రశేఖర్‌ను నూతన అధ్యక్షుడిగా నియమించారు.
        » నాస్‌కామ్ ఛైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్
 

            ఆర్.చంద్ర శేఖర్
జులై  6
¤ తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎం.జి.గోపాల్ బాధ్యతలు స్వీకరించారు.        » గోపాల్ తితిదే కు 23వ ఈవో.        » ఆయన పూర్తిపేరు ముక్కామల గిరిధర్ గోపాల్.        » ఎల్‌వీ సుబ్రహ్మణ్యం స్థానంలో గోపాల్ బాధ్యతలు చేపట్టారు.



జులై - 2013 క్రీడలు

 జులై  1
¤ ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య (ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ - ఏఏఏ) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సురేష్ కల్మాడీ ఖతార్‌కు చెందిన దహ్లాన్ జుమాన్ అల్-హమద్ చేతిలో 18-20 తేడాతో ఓటమి చెందాడు.
         » దీంతో సురేష్ కల్మాడీ 13 ఏళ్ల అధిపత్యానికి తెరపడింది.
         » ఐఏఏఎఫ్ అధ్యక్షుడు లామిన్ డియాక్ సమక్షంలో 45 దేశాలు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఏడు ఓట్లు చెల్లలేదు.
         » కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో చిక్కుకుని జైలుపాలైన కల్మాడీ, బెయిల్‌పై విడుదలయ్యాడు.
¤ కాన్ఫెడరేషన్స్ కప్-2013 ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా బ్రెజిల్ నిలిచింది.
         » ప్రపంచ, యూరో ఛాంపియన్ స్పెయిన్‌ను ఫైనల్లో 3-0 తో బ్రెజిల్ ఓడించింది.

             కాన్ఫెడరేషన్స్ కప్-2013
         » కాన్ఫెడరేషన్స్ కప్ గెలవడం బ్రెజిల్‌కు వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. మొత్తం మీద నాలుగోసారి.         » అయిదు గోల్స్ చేసిన స్పెయిన్ స్టార్ టోరెస్‌కు గోల్డెన్ బూట్ అవార్డు లభించింది.
         » 
మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఉరుగ్వేని పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో ఇటలీఓడించింది.
 జులై  2
¤ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా కింగ్‌స్టన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 161 పరుగుల తేడాతో ఓటమి పొందింది.
 జులై  3
¤ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఉదయలక్ష్మి పుణేలో ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఐ లక్ష్మిపై సస్పెన్షన్ విధించి ఆసియా అథ్లెటిక్స్ నుంచి బహిష్కరించింది.
         » ఉదయలక్ష్మి డోప్ పరీక్షలో పట్టుబడటం ఇది రెండోసారి. 2002లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో ఆమె డోపీగా తేలింది.
¤ దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా ఇండోర్ క్రీడల కబడ్డీలో భారత్ పురుష, మహిళల జట్లు స్వర్ణపతకాలు గెలుచుకున్నాయి.
 జులై  4
¤ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ భారత్‌కు తొలి స్వర్ణపతకం అందించాడు.
         » వికాస్ గౌడ డిస్క్‌ను 64.90 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు.
         » ఈ విజయంతో వికాస్ వచ్చే నెలలో మాస్కోలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.
¤ భారత సంతతికి చెందిన విద్యార్థి సమ్రిద్ అగర్వాల్ ఇంగ్లిష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.
         » ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న సమ్రిద్ కేంబ్రిడ్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో 313 పరుగులతో అజేయంగా నిలిచాడు.
         » ఇంగ్లండ్‌లో ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ యూనివర్సిటీ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి.
 జులై  5
¤ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.         » మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లి.¤ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ 7-5, 4-6, 7-6, 6-7, 6-3తో డెల్ పొట్రో (అర్జెంటీనా)పై నెగ్గి ఫైనల్‌లో ప్రవేశించాడు.         » ఈ మ్యాచ్ 4 గంటల 43 నిమిషాలు సాగడం విశేషం. వింబుల్డన్ చరిత్రలో సుదీర్ఘమైన సెమీస్‌గా తాజా మ్యాచ్ రికార్డులకెక్కింది. 1989లో బోరిస్ బెకర్, లెండిల్‌ల మధ్య 4 గంటల ఒక నిముషం సాగిన మ్యాచ్ వింబుల్డన్‌లో ఇప్పటిదాకా సుదీర్ఘమైన సెమీస్‌గా రికార్డుల్లో ఉంది. 
 జులై  6
¤ ఫ్రాన్స్ క్రీడాకారిణి మరియన్ బర్తోలి 2013 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆవిర్భవించింది.
         » ఫైనల్లో 6-1, 6-4తో వరుస సెట్లలో జర్మనీ క్రీడాకారిణి సబైన్ లిసికి పై మరియన్ బర్తోలి విజయం సాధించింది.

          మరియన్ బర్తోలి
         » 28 ఏళ్ల బర్తోలి కెరీర్లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం గమనార్హం.
         » 2006లో ఫ్రెంచ్ క్రీడాకారిణి అమెలీ మౌరెస్మో వింబుల్డన్ టైటిల్ సాధించిన తర్వాత ఈ ఘనత సాధించిన ఫ్రెంచ్ వనిత బర్తోలి.
         » బర్తోలి 2007లో వింబుల్డన్ ఫైనల్‌కు చేరినా, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.         » అమెలీ మౌరెస్మోను వింబుల్డన్‌కు ముందు బర్తోలికి కోచ్‌గా నియమించారు. అమెలీ మౌరెస్మో మాజీ ప్రెంచ్ క్రీడాకారిణి. 2006లో వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గింది. 2009లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన మౌరెస్మో తాజాగా కోచ్‌గా మారింది.         » వింబుల్డన్ టైటిల్ గెలిచే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని బర్తోలికి వింబుల్డన్ ట్రోఫీతో పాటు 16 లక్షల పౌండ్లు (రూ.14.36 కోట్లు) ప్రైజ్ మనీగా లభించింది.         » అత్యధికంగా 47 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాక బర్తోలికి ఈ టైటిల్ లభించింది. ఇప్పటివరకు ఈ రికార్డు యానా నొవొత్నా (1998లో వింబుల్డన్ టైటిల్ - 45 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు) పేరిట ఉండేది.         » వింబుల్డన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను అమెరికా సోదర ద్వయం బాబ్ బ్రయాన్ - మైక్ బ్రయాన్ రికార్డు స్థాయిలో గెలుచుకున్నారు. ఫైనల్లో వీరు 3-6, 6-3, 6-4, 6-4తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) - మెలో (బ్రెజిల్) జంటపై గెలిచారు.         » ఈ గెలుపుతో బ్రయాన్ సోదరులు గోల్డెన్ స్లామ్ సాధించారు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణంతో బ్రయాన్ బ్రదర్స్ గోల్డెన్‌స్లామ్ దక్కించుకున్నారు.         » బ్రయాన్ సోదరులు 2012 లండన్ ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో పురుషుల డబుల్స్‌లో స్వర్ణం నెగ్గారు.

No comments:

Post a Comment

amazon

Sukanya Samriddhi Account - SBI

SUKANYA SAMRIDDHI Account information by SBI SUKANYA SAMRIDDHI ACCOUNT : FACILITY AVAILABLE AT ALL BRANCHES OF SBI Sukanya Samriddhi ...